
సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా కొనసాగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 19 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళల క్రికెట్ జట్టు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా కొనసాగనుంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హర్మన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్‌కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు హర్మన్‌కే అప్పగించడం విశేషం.
స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ యాస్తికా భాటియాను తప్పించి.. ఆమె స్థానంలో జి.కమిలినిని ఎంపిక చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆటకు దూరమైన శ్రేయాంక పాటిల్.. ఫిట్నెస్ ఆధారంగా జట్టులో చేరనుంది. బ్యాటింగ్ విభాగంలో షఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్ వంటి కీలక ప్లేయర్లు ఉండగా.. బౌలింగ్‌లో దీప్తి శర్మ, శ్రీచరణి, అరుంధతీ రెడ్డి ఎంపికయ్యారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీచరణి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతీ రెడ్డి, శ్రేయాంక పాటిల్*, రాధా యాదవ్, నందిని శర్మ.
వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు: కైఫ్
ఫిఫా ప్రపంచ కప్: పెనాల్టీ షూటౌట్లో పరాగ్వే సంచలన విజయం