Pune Fort Murder Controversy : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లోహగడ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ హత్యా ఉదంతంలో సరికొత్త లీగల్ వార్ మొదలైంది. ఈ కేసులో ప్రధాన నింది
తురాలిగా ఉన్న సియా గోయల్ తరపున కోర్టులో వాదించే విషయమై ఇద్దరి న్యాయవాదుల మధ్య గొడవ మొదలైంది. ముఖ్యంగా అశుతోష్ శ్రీవాస్తవ, విపుల్ దుషింగాలు ఇద్దరూ.. సియా తన క్లయింటే అంటే తన క్లయింటే అని గొడవ పడుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరిలో ఒకరైన న్యాయవాది అశుతోష్ శ్రీవాస్తవ.. సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌కు ఏకంగా రూ. 10 కోట్ల భారీ పరువు నష్టం నోటీసు జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.లాయర్ల మధ్య వివాదం ఇదీ..!పూణేకు చెందిన అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో తనను డిఫెన్స్ లాయర్‌గా సియా గోయల్ స్వయంగా నియమించుకుందని, తన తరపున కోర్టులో హాజరు కావడానికి అధికారికంగా 'వకాలత్ నామా'పై కూడా సంతకం చేసిందని స్పష్టం చేశారు. అయితే ఈ వాదనలను సియా సోదరుడు సాహిల్ గోయల్ తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబం అడ్వకేట్ విపుల్ దూషింగ్ను సంప్రదించిందని, ఆయనే సియా తరపున వాదిస్తారని మీడియా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు లాయర్లతో మీడియా మాట్లాడగా.. ఇద్దరూ సియా లీగల్ రిప్రజెంటేటివ్స్ తామేనని అధికారికంగా ప్రకటించారు.రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. 48 గంటల గడువు!అయితే ఈ హైడ్రామా వడగావ్ మావల్ కోర్టు విచారణలో క్లైమాక్స్‌కు చేరింది. కోర్టు హాల్లో ప్రధాన నిందితురాలు సియా గోయల్ స్వయంగా స్పందిస్తూ.. "అశుతోష్ శ్రీవాస్తవ నా లాయర్ కాదు.. విపుల్ దూషింగ్ మాత్రమే నా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు" అని ప్రకటించడంతో ఈ వివాదం మరింత ఎక్కువైంది. సియా సోదరుడు సాహిల్ చేసిన బహిరంగ ప్రకటనల వల్ల తన వృత్తిపరమైన ప్రతిష్టకు, గుడ్‌విల్‌కు తీవ్ర భంగం కలిగిందని అడ్వకేట్ అశుతోష్ శ్రీవాస్తవ మండిపడ్డారు. ఈ మేరకు సాహిల్‌కు 10 పేజీల లీగల్ నోటీసు పంపారు. తానేమీ అనధికారికంగా మీడియా ప్రొజెక్షన్ కోసం ఈ కేసులోకి రాలేదని, మేజర్ అయిన నిందితురాలు, సియానే స్వచ్ఛందంగా సంతకం చేసిన లీగల్ అథారిటీతోనే వచ్చానని స్పష్టం చేశారు.సాహిల్ చేసిన అవాస్తవ ప్రచారాల వల్ల తనకు మానసిక క్షోభ, సమాజంలో నమ్మకం కోల్పోవడం జరిగిందని ఆరోపిస్తూ.. సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపుల నుంచి ఆ వీడియో బైట్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. 7 రోజుల్లోగా రూ. 10 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు.. 48 గంటల్లోగా బేషరతుగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని నోటీసులో గడువు విధించారు.కస్టడీ పొడిగింపు.. కేతన్ పాస్‌పోర్ట్ దహనం!మరోవైపు కోర్టు సోమవారం సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల పోలీస్ కస్టడీని మరో 5 రోజులు పొడిగించింది. అయితే నిందితులిద్దరి సమక్షంలో క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేయాల్సి ఉందని, సియా ఇప్పటికే కేతన్ పాస్‌పోర్ట్‌ను చింపి తగుల బెట్టిందని, ఆ అవశేషాలను రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. హత్య తర్వాత ప్రియుడు చేతన్ బట్టలు మార్చుకుని తిరిగిన ప్రాంతాలను గుర్తించడంతో పాటు వీరిద్దరి కాల్ డేటాను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు.