పచ్చిమిర్చి, కూరగాయలతో 20 నిమిషాల్లోనే ఈ ఉప్మా చేసేయొచ్చు. ఈజీగా, తొందరగా అయిపోతుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ తక్కువ టైంలోనే చేయొచ్చు. ఎలాంటి ప్రిపరేషన్ అక్కర్లేదు.
అన్నం, నచ్చిన కూరగాయలు వేసుకుని చటుక్కున చేసేయొచ్చు.
ముందుగానే పెసలను నానబెట్టుకుని పిండి చేసుకుంటే ఎప్పటికప్పుడు పెసరట్లు నిమిషాల్లో చేసుకుని తినొచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్.
ఉడికించిన అన్నంలో టమాటా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, మసాలాలతో త్వరగా టమాటా రైస్ చేసుకోవచ్చు.
బ్రెడ్ స్లైస్‌ల మధ్య టమాటా, క్యారెట్, పనీర్, చీజ్ పెట్టి గ్రిల్ చేస్తే పది నిమిషాల్లోనే శాండ్విచ్ రెడీ అయిపోతుంది.
ఓట్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్‌తో సులువుగా ఓట్స్ కిచిడి చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు.
మిగిలిన అన్నంతో పెరుగు అన్నం చేసుకుని తినొచ్చు. ఎక్కువ టైం అవసరం లేదు. ఈజీగా అయిపోతుంది. తేలికగా ఉంటుంది.
పనీర్‌ని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలాలతో వేయించి బుర్జీ చేసుకోవచ్చు. రొట్టెలు, బ్రెడ్‌లోకి బాగుంటుంది.
అటుకుల్లో నచ్చిన కూరగాయలు వేసి వెజిటేబుల్ పోహా చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోపే అయిపోతుంది.