సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. వీటిని తింటే చర్మం వాపు తగ్గుతుంది. చర్మం మృదువుగా మారు
తుందని క్లీవ్‌లాండ్ క్లీనిక్ నివేదిక తెలిపింది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఇ కూడా లభిస్తుంది. వీటిని తింటే చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ముడతలు తగ్గుతాయి.
వాల్‌నట్స్‌లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో జింక్ కూడా లభిస్తుంది. వాల్నట్స్ తింటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. చిలగడదుంపలు తింటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
టమాటాల్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీ తాగితే చర్మం తేమగా ఉంటుంది. ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి.
డార్క్ చాక్లెట్లలో ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్లు తింటే అందం రెట్టింపు అవుతుంది.
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బెర్రీస్ తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి.
బెల్ పెప్పర్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మాన్ని అందంగా ఉంచుతుంది.