
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Online Shopping Scam: ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు ప్రస్తుతం ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బయటకు ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లో కూర్చొని నచ్చిన వస్తువులను ఒక్క క్లిక్‌తో తమ వద్దకే తెప్పించుకుంటున్నారు. దుస్తులు, మొబైల్ ఫోన్లు, కిరాణా సామాగ్రి, చివరకు మందులను కూడా ఆర్డర్ చేస్తున్నారు. కొంతమంది పండుగ అమ్మకాలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లకు ఆకర్షితులై.. ఆలోచించకుండా షాపింగ్ చేస్తున్నారు. ఇలా ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు ఆఫర్ల పేరుతో వల వేస్తూ.. నకిలీ వెబ్సైట్లు, ఫేక్ ఆఫర్లు, తప్పుడు లింకుల ద్వారా మోసం చేస్తూ వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా యువత ఎక్కువ ఉపయోగించే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా భారీ ప్రకటనలు ఇస్తూ.. ఈమెయిల్స్ పంపిస్తూ దోచేసుకుంటున్నారు.
ఒక్కసారి ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేస్తే.. మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసేవరకు వదిలిపెట్టరు. నకిలీ వెబ్సైట్లు, తప్పుదారి పట్టించే లింక్స్ కు భారీ ఆఫర్ల పేరుతో వల వేస్తూ ఆకర్షిస్తున్నారు. అందుకే చిన్నపాటి అజాగ్రత్త కూడా మీ అకౌంట్లో డబ్బులను మాయం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
ఇటీవల వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఫేక్ ఆఫర్ల ప్రకటనలు ఎక్కవైపోయాయి. వన్ ప్లస్ టూ ఆఫర్లు, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ ట్రయల్ అంటూ ముందుగా ఆకట్టుకుంటున్నారు. బయట మార్కెట్లో ఉన్న ధర కంటే.. చాలా తక్కువగా చూపిస్తారు. ఇలాంటి చెక్ చేసుకోకుండా క్లిక్ చేసి.. మీ వివరాలు ఎంటర్ చేస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లే. ఇలాంటి ఈ లింక్‌లలో చాలా వరకు నకిలీవి ఉంటాయి. కేవలం మోసం చేయడానికే క్రియేట్ చేసి ఉంటారు. వీటిని సరిచూసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి.
ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు.. సరైన యాప్ లేదా వెబ్‌సైట్‌ను గుర్తించడం చాలా ముఖ్యం. సైబర్ నేరగాళ్లు అసలైన వాటిలాగే కనిపించే నకిలీ వెబ్సైట్లు, యాప్‌లను క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని క్లిక్ చేసే ముందు అసలైన వెబ్ సైట్ల స్పెల్లింగ్.. ఫేక్ వెబ్ సైట్ల స్పెల్లింగ్, లోగోలు కచ్చితంగా సరి చూసుకోండి. ఆఫర్ల పేరుతో ఉండే ప్రకటనలను చూసి ఫేక్ వెబ్ సైట్లపై క్లిక్ చేయడం కంటే.. నేరుగా అసలైన ప్లాట్ ఫారమ్స్ నుంచి కొనుగోలు చేయడం బెటర్.
చాలా మంది మళ్లీ మళ్లీ షాపింగ్ చేసే సమయంలో ఈజీగా ఉంటుందని తమ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను లేదా నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని యాప్‌లు, వెబ్సైట్లలో సేవ్ చేస్తుంటారు. ఇలా చేయడం డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆ వెబ్సైట్ సురక్షితం కాకపోతే.. మీ బ్యాంక్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతికి వెళ్లిపోయి.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల చెల్లింపులను మాన్యువల్‌గా చేయడం మంచిది. నకిలీ ఆఫర్లు ఉన్న ఇమెయిల్‌ల ద్వారా క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు లేదా గిఫ్ట్ వోచర్ల పేరుతో ప్రలోభపెడుతున్నారు. ఇలాంటి ఈమెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండి.. దూరంగా ఉండండి.