
MLA Manik Rao | ఝరాసంగం, జూన్30 : ప్రకృతి జల వనరులైన చెరువులు, వరద కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించి గోడలు నిర్మించడంపై జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్‌రావు తీవ్రంగా స్పందించారు.
నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితమైన ‘పొట్టిపల్లి గ్రామ శివారులోని అలుగు చెరువు కాలువ కబ్జా’ అనే కథనానికి స్పందించి ఆయన మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, పత్రికా కథనం ఆధారంగా ఎమ్మెల్యే నేరుగా రంగంలోకి దిగారు.
గ్రామస్థులతో కలిసి కబ్జాకు గురైన అలుగు చెరువు వరద కాలువ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ‘ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగేలా కాలువలను ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారు..?’ అని అధికారులను నిలదీశారు. తక్షణమే సర్వే నిర్వహించి, అక్రమ నిర్మాణాలను తొలగించి, వరద కాలువను యథాస్థితికి తీసుకురావాలని స్పష్టం చేశారు.
తద్వారా స్థానిక రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, సర్పంచ్ శ్యామల మొగులయ్య, నాయకులు సిద్ధన్న పాటిల్, విష్ణు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Canal Missing | ప్రభుత్వ రికార్డుల్లోని కాల్వ మాయం.. ఫామ్‌ల్యాండ్ వెంచర్ కోసం ఆగని ఆక్రమణలు Guo Wengui: చైనా బిలియనీర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన అమెరికా కోర్టు AP News | రైల్వేస్టేషన్లో పాములు.. ప్రయాణికులు బెంబేలు..!