
Rao Bahadur Trailer : సత్యదేవ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా రావు బహదూర్. GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ బాబు సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్ బ్యానర్స్ పై చింత...
Rao Bahadur Trailer : సత్యదేవ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా రావు బహదూర్. GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ బాబు సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్ బ్యానర్స్ పై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాణంలో వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు నిర్మాణంలో భాగస్వామి అయ్యారని తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్ వివిధ గెటప్స్ లో, సరికొత్త నటనతో కనిపించబోతున్నాడు.