
ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తీసుకుంటే ముప్పే!ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తీసుకుంటే ముప్పే! 30 June 2026 TV9 Telugu TV9 Telugu ఎంత మంచిదైనా అతి పనికిరాదు.
ఇది విటమిన్ ఎ మోతాదుకు అతికినట్టు సరిపోతుంది. కళ్లు, రోగనిరోధక వ్యవస్థకి విటమిన్ ఎ తోడ్పడుతుంది కానీ మరీ అతిగా తీసుకుంటే కాలేయ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. మన శరీరం సహజంగానే విటమిన్ ఎ నిల్వ చేసుకుంటుంది అందువల్ల దీన్ని మరింత ఎక్కువగా పోగుపడేలా చేయటం మంచిది కాదు. ఇది మితిమీరితే తలనొప్పి, వికారం, తల తిప్పటం, కాలేయం దెబ్బతినటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి విటమిన్ ఎ రూపమైన బీటా-కెరటిన్ మాత్రలను పెద్ద మొత్తంలో తీసుకుంటే కాలేయ క్యాన్సర్కూ దారితీయొచ్చు ముఖ్యంగా పొగ తాగేవారికి, పొగ అలవాటుండి మానేసినవారికి, ఆస్బెస్టాస్ ప్రభావానికి గురయ్యేవారికి దీని ముప్పు ఎక్కువ అందువల్ల సురక్షితంగా విటమిన్ ఎ లభించేలా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు ఆహారమే మార్గం. చేపలు, పాలకూర, క్యారెట్లు, అప్రికాట్లతో ఇది దండిగా లభిస్తుంది ఆకుపచ్చ, నారింజ, పసుపు రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లు తినటం మంచిది. సాధారణంగా డాక్టర్లు మాత్రల కన్నా ఆహారానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు ఒకవేళ మాత్రలు వేసుకోవటం తప్పనిసరైతే సిఫారసు చేసిన మోతాదులకు కట్టుబడి ఉండాలి. లేదంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి