
వ్యాయామాలు శారీరక, మానసిక ఆరోగ్యాల్ని పెంపొందిస్తాయి.. భావోద్వేగాల్ని అదుపులో ఉంచుతాయి. అయితే ఇవే వ్యాయామాలు అనుబంధాల్నీ దృఢం చేస్తాయంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.
ముఖ్యంగా ధ్యానం పాజిటివ్ ఆలోచనల్ని రేకెత్తించి.. ఎదుటి వ్యక్తిని సానుకూల దృక్పథంతో చూసేలా ప్రేరేపిస్తుందంటున్నారు.
వ్యాయామాలు శారీరక, మానసిక ఆరోగ్యాల్ని పెంపొందిస్తాయి.. భావోద్వేగాల్ని అదుపులో ఉంచుతాయి. అయితే ఇవే వ్యాయామాలు అనుబంధాల్నీ దృఢం చేస్తాయంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ముఖ్యంగా ధ్యానం పాజిటివ్ ఆలోచనల్ని రేకెత్తించి.. ఎదుటి వ్యక్తిని సానుకూల దృక్పథంతో చూసేలా ప్రేరేపిస్తుందంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ధ్యానం చేసినా, విడివిడిగా చేసినా.. ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దృఢం చేస్తుందని చెబుతున్నారు.
⚛ ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. ఫలితంగా కోపాన్ని అదుపులో ఉంచుకొని ఏ విషయం గురించైనా ప్రశాంతంగా ఆలోచించగలుగుతాం. ఈ ప్రశాంతతే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా.. ఒకవేళ వచ్చినా.. వాటికి తగిన పరిష్కార మార్గాలు వెతుక్కునే నేర్పును అందిస్తుందంటున్నారు నిపుణులు.
⚛ మనసులోని ప్రతికూల ఆలోచనల్ని దూరం చేయడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా పాజిటివిటీని అలవర్చుకోగలుగుతాం. ఇలా ప్రతిదీ సానుకూల దృక్పథంతో చూసే మనం.. ఎదుటి వ్యక్తిలోనూ అలాంటి లక్షణాలనే చూడగలుగుతాం. వారి మాటలు, భావాల్నీ అర్థం చేసుకోగలుగుతాం. భార్యాభర్తల మధ్య పెరిగిన దూరాన్ని దగ్గర చేసుకోవాలంటే ఇదీ ముఖ్యమే అంటున్నారు నిపుణులు.
⚛ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అవతలి వారితోనూ సులభంగా కలిసిపోగలుగుతాం.. తద్వారా ఇటు మన మనసులో ఉన్న సమస్యలు, బాధల్ని వారితో పంచుకోవడంతో పాటు.. వారు చెప్పే విషయాల్నీ శ్రద్ధగా వినగలుగుతాం. ఇలా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాల్లేనప్పుడు అనుబంధంలోనూ ఎలాంటి కలతలు రావంటున్నారు నిపుణులు.
⚛ కొన్నిసార్లు భార్యాభర్తలిద్దరిలో ఎవరికి కోపం వచ్చినా.. అవతలి వారు మాట పడరు. దీనివల్ల గొడవ పెద్దదవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఇలాంటప్పుడు ఓపికతో వ్యవహరించాలన్నా, భరించే శక్తిని పెంచుకోవాలన్నా ధ్యానం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
⚛ క్షమాగుణాన్ని పెంచడంలోనూ ధ్యానం తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. పొరపాటు మీరు చేసినా, అవతలి వారు చేసినా.. క్షమాపణ కోరడం, క్షమించగలగడం అలవాటు చేసుకుంటే.. బంధం బ్యాలన్స్డ్గా ముందుకు సాగుతుందంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.