
గంజాయి నిరోధానికి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నితికా పంత్ అన్నారు. స్థానికంగా మంగళవారం ఎస్పీ మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లో నమోదు అయిన 57 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 296.31 కిలోల డ్రై గంజాయి, 964 గంజాయి మొక్కలను జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిస్తూ ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్లు ఎస్పీ తెలిపారు
ఆసిఫాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): గంజాయి నిరోధానికి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నితికా పంత్ అన్నారు. స్థానికంగా మంగళవారం ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లో నమోదు అయిన 57 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 296.31 కిలోల డ్రై గంజాయి, 964 గంజాయి మొక్కలను జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిస్తూ ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.1.70 కోట్లు ఉంటుందన్నారు. గత ఏడాది 53 కేసులకు సంబంధించి 117.856 కిలోల గంజాయి, 1,039 గంజాయి మొక్కలను అదే విధానంలో దహనం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మిట్లాడుతూ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నమోదై కేసులకు సంబంధించిన గంజా యిని నిబంధనల మేరకు నిర్మూలించామని చెప్పారు. కొందరు అక్రమార్జన కోసం గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడేస్తున్నారని, ఇటువంటి అసాంఘీక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత స్థాయి తనిఖీలు, ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, సీఐ రవీందర్, బాలాజీ వరప్రసాద్, శ్రీనివాస్, వేణుగోపాల్, ఎస్సైలు సుధాకర్, మహేందర్, వెంకటకృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): పోలీసు స్టేషన్లో నమోదయ్యే కేసుల దర్యాప్తును నాణ్యంగా, వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పెంచికలపేట పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆమె స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఎస్పీ, పోలీసు సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీసు స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించి స్టేషన్‌ను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రేవ్ కేసులు, పెండింగ్‌కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, సీడీ పైళ్లు, రౌడీ సీట్లు, సస్పెక్ట్ ఫీట్లు, బైండోవర్ కేసుల వివరాలను ఎస్సై అనీల్‌కుమార్‌ను అడిగి తెలుసుకన్నారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యతతో పూర్తి చేసి బాధితులకు త్వరిగతిన న్యాయం అందించాలని ఆదేశించారు. దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వానలి, నేరాల నియంత్రణోల పోలీసులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంత నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవమరించి వారి సమస్యలను ఓర్పుతో విని చట్ట ప్రకారం త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ప్రజల్లో పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బంది కిట్‌ను పరిశీలించి వారి శాఖాపరమైన అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వరద సహయక చర్యల్లో వినియోగించే లైఫ్ జాకేట్లు, ఇతర భద్రత సామగ్రిని కూడా పరిశీలించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ వాహిదుద్దీన్, సీఐ కుమారస్వామి, ఎస్సైలు అనీల్, రమేష్, సందీప్‌కుమార్ తదితరులు ఉన్నారు.