
లండన్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) ఆస్ట్రేలియా (Australia) జట్టు ఫైనల్‌కు చేరింది. వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన సెమీస్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆ లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఎనిమిదోసారి.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. వెనువెంటనే వికెట్లు పడగొడుతూ స్కోరు బోర్డును కట్టడి చేశారు. వెస్టిండీస్ అతి కష్టం మీద 125 పరుగులు చేసింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (30) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో సోఫీ, గార్డెనర్, జార్జియా తలో 2 వికెట్లు పడగొట్టగా సదర్లాండ్ ఒక వికెట్ తీసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ జార్జియా వోల్ (16) తక్కువ పరుగులకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ బెత్ మూనీ (61*) అర్ధశతకంతో విజృంభించడంతో ఆస్ట్రేలియా అలవోకగానే విజయం సాధించింది. గార్డెనర్ (35*) కీలక ఇన్నింగ్స్ ఆడింది. విండీస్ బౌలర్లలో హెన్రీ, హేలీ మ్యాథ్యూస్ ఒక్కో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో అశ్విన్ రామ్ 15 ఓవర్లో ఏకంగా 35 సమర్పించుకున్నాడు.