
చర్మంపై పడిన దుమ్ము-ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్ తొలగించుకోకపోవడం.. వంటి కారణాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్..
మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే రాత్రి పూట చర్మాన్ని సంరక్షించుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు.
రాత్రి పూట పడుకున్న సమయంలో మన శరీరం చర్మ కణాల్ని రిపేర్ చేస్తుంది. అయితే పడుకునే ముందు మేకప్ తొలగించుకోకపోతే.. చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్ము-ధూళి అక్కడే ఉండిపోతుంది. దానివల్ల మొటిమలొస్తాయి. కాబట్టి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది మేకప్ తొలగించుకోవడానికి క్లెన్సర్‌ని మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ మేకప్ రిమూవర్‌ని వాడడం మంచిది. మేకప్ తొలగించుకోవడానికి ఒక కాటన్ బాల్ని తీసుకొని దాన్ని రిమూవర్లో ముంచి మసాజ్ చేస్తున్నట్టుగా తొలగించుకుంటే.. మేకప్ పూర్తిగా తొలగిపోతుంది.. ఫలితంగా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడైనా చర్మాన్ని స్క్రబ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం మీద పేరుకున్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయట. ఫలితంగా చర్మరంధ్రాలు మూసుకుపోకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. రాత్రి పూట ఈ ప్రక్రియను పాటిస్తే మెరుగైన ఫలితాలుంటాయంటున్నారు. దీంతో పాటు చర్మతత్వానికి సరిపడే స్క్రబ్‌ని ఎంచుకోవడం కూడా ముఖ్యమేనని సూచిస్తున్నారు.
⚛ కంటి కింది భాగం మాదిరిగానే పెదాలు కూడా సున్నితంగా ఉంటాయి. అందుకే పెదాలపై స్క్రబ్ చేయకూడదట. పెదాలను గోరువెచ్చని నీటితో కడిగి ఓ శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా రుద్దడం వల్ల అక్కడ ఏర్పడిన మృతకణాలు తొలగిపోతాయట. తర్వాత లిప్‌బామ్ పూయడం వల్ల వాటికి తేమ అందుతుంది. దీనివల్ల పెదాలు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.
⚛ ఇవన్నీ చేసినా మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా అవసరం. తద్వారా చర్మానికి తేమ అంది సున్నితంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.