
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య జులై 1 నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడాడు.
టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ హీరోలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నాడు. ‘‘జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించారు. ఇది కేవలం ఏ ఒక్క వ్యక్తి చేసిన పని కాదు. ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చి భద్రతను కల్పించాలి. తద్వారా ప్రతి ఒక్కరూ రాబోయే టోర్నమెంట్లలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారు. గత టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు టీ20 మ్యాచ్ ఎలా ఆడాలో అవగాహన ఉంటుంది. ఆ ప్లేయర్లు నిరంతరం ఈ ఫార్మాట్లో జట్టుకు కీలకంగా ఉన్నారు. కాబట్టి వారికి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం’’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడనుకుంటే అది జరగలేదు. దీంతో టీమ్ మేనేజ్మెంట్పై అభిమానులు, మాజీలు విమర్శలు గుప్పిస్తూ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో శ్రేయస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లోనూ ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోవడంపై కూడా శ్రేయస్ మాట్లాడాడు. ‘‘అది అవమానకరం కాదు. కానీ, సిరీస్ ఫలితం మమ్మల్ని నిరాశపరిచింది. ఎందుకంటే ఐర్లాండ్ అంత బాగా ఆడుతుందని మేము అస్సలు ఊహించలేదు. వారు ప్రతి విభాగంలోనూ మమ్మల్ని అధిగమించారు. మైదానం గురించి వారికి మంచి అవగాహన ఉంది. ఈ విషయంలో మేం వెనుకబడ్డాం. ఆ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇక్కడికి రావడం మాకు పూర్తిగా ఒక కొత్త అధ్యాయం. మాలో కొందరు ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో ఆడారు. ఇక్కడి పరిస్థితులు, మైదానాలు మాకు తెలుసు’’ అని అయ్యర్ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
టీజీ20 లీగ్ 2026లో భాగంగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో అశ్విన్ రామ్ 15 ఓవర్లో ఏకంగా 35 సమర్పించుకున్నాడు.