
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
TTD Cancels SSD Tokes On July 1st in Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారం తిరుమల ప్రస్తుతం భక్తులతో నిండిపోయింది. ఎక్కడ చూసిన భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మార్మోగిపోతున్నాయి. ఒకవైపు వరుస సెలవులు, వీకెండ్ నేపథ్యంలో గత వారం నుంచి తిరుమలలో ఒక్కసారిగా విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులు తిరుమలకు రికార్డు స్థాయిలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే టీటీడీ ఇటీవల వీఐపీ బ్రేక్ దర్శనాల్ని, శ్రీవాణి కోటా టికెట్లను రద్దు చేసింది. ఆ తర్వాత సామాన్య భక్తులే తొలి ప్రాధాన్యతను ఇస్తు టీటీడీ దర్శనాలు కల్పిస్తుంది.
మరోవైపు తిరుమలలో భక్తులకు ఎక్కడ కూడా క్యూలైన్ లలో ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్న ప్రసాదం, అల్పహారం, తాగునీరులను శ్రీవారి సేవకులతో అందిస్తుంది. ఈ క్రమంలో భక్తుల రద్దీని కొంత మేరకు కంట్రోల్ చేసేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1న తిరుమలలో శ్రీవారి దర్శనాలకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లు, దివ్యదర్శనం టొకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో ప్రతిరోజు భక్తుల కోసం మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ జారీచేస్తుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ (కేంద్ర బస్ స్టేషన్ దగ్గర), విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురుగా), భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి టోల్ గేట్ దగ్గర).. ప్రతిరోజు భక్తులకు టోకెన్లను జారీ చేస్తుంటారు. ప్రస్తుతం విపరీమైన రద్దీ నేపథ్యంలో జులై 1న దివ్యదర్శనంతో పాటు, ఎస్ఎస్డీ టోకెన్ల జారీలను రద్దు చేస్తు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Read more: Tirumala Rush: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 2.5 లక్షల మంది శ్రీవారి దర్శనం.. అసలు కారణం ఇదే!
భక్తులు ఈ విషయాల్ని గమినించి తమతో సహాకరించాలని ఒక ప్రకటనలో కోరింది. ఇక టొకెన్లు లేని సర్వదర్శనాలకు దాదాపు 30 గంటల సమయం, రూ. 300 టికెట్ ఉన్నవారికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. మరోవైపు జులై 1న మొదటి తేదీ రోజు శ్రీవారిని దర్శించుకొవాలని ప్లాన్ లు చేసుకున్న భక్తులు తీవ్ర నిరుత్సాహంకు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.