
‘శబరికొండ పిలిచింది.... మణికంఠుని చేరగ పదమందీ...’ అని పాడుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు కథానాయకుడు రవితేజ. ఇదంతా ‘ఇరుముడి’ చిత్రంలో భాగంగానే!
రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు... ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. కల్యాణ్ చక్రవర్తితో కలిసి శివ నిర్వాణ రాసిన ఈ పాటని అనంతు ఆలపించారు. జి.వి.ప్రకాశ్‌కుమార్ స్వరపరిచారు. కథానాయకుడు రవితేజ ఇందులో అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్నారు. ఆయన భార్యగా ప్రియా భవానీ శంకర్, కూతురుగా బేబీ నక్షత్ర నటించారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఓ కుటుంబ కథ ఇది. రవితేజ శైలి మాస్ అంశాలూ ఇందులో ఉన్నట్టు టీజర్ చాటి చెప్పింది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, శ్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిశోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమిల్లి, మహేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విష్ణుశర్మ, ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్, కూర్పు: ప్రవీణ్ పూడి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.