తమిళ హీరో సూర్య ‘వీరభద్రుడు’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. తమిళంలో 'కరుప్పు' పేరుతో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.
340 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ జోష్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. ‘KGF’, ‘కాంతార’, ‘సలార్’ వంటి హిట్ ప్రాంచైజీలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’తో సూర్య ఓ సినిమా చేస్తున్నారు. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జై భీమ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఆ వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.#SuriyaXHombale మూవీలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రఫీ.. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. చిత్రబృందం త్వరలోనే టైటిల్, విడుదల తేదీని ప్రకటించనుంది.