
అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన చమురు సంక్షోభం ప్రభావం భారత్ పైనా పడింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) అమ్మకాలపై పలు ఆంక్షలు విధించింది.
ఇప్పుడు ఇరాన్ వార్ ముగిసినా ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై గతంలో విధించిన ఆంక్షల్ని ఎత్తేయాలని నిర్ణయించింది.ఇరాన్ డీల్ తో కుప్పకూలిన చమురు ధరలు..! అయినా ట్రంప్ కు వీడని కష్టాలు..!ఇరాన్ వార్ సమయంలో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మీదుగా భారత్ కు రావాల్సిన చమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలో సంక్షోభం రాకుండా కేంద్రం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల వాణిజ్య కొనుగోలుదారులు రిటైల్ ఇంధన కేంద్రాలలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేకపోయారు. అంతర్జాతీయంగా చమురు సరఫరా మరింత దిగజారితే సాధారణ ప్రజలకు తగినంత ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు.. అప్పట్లో ప్రభుత్వం డీజిల్ కొనుగోళ్లపై రోజువారీ పరిమితిని కూడా విధించింది. 70 డాలర్లకే క్రూడాయిల్- ఇంకా పెట్రోల్ 116 రూపాయలా ? ఇప్పుడు ఇంధన సరఫరాలపై ఆందోళనలు తగ్గిన నేపథ్యంలో జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యప్రాచ్యంలోని సంఘర్షణ ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించి, కొరత ఏర్పడే అవకాశం ఉందనే భయాలను రేకెత్తించడంతో ఈ ఆంక్షలను ప్రవేశపెట్టారు.ఇప్పుడు క్రమంగా అవన్నీ తొలగిపోవడంతో ఆంక్షల్ని సడలిస్తున్నారు. దీంతో ఇకపై వినియోగదారులు ఎప్పటిలాగే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేందుకు వీలు కలగనుంది.