
ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది.
Jun 29 2026 6:06 PM | Updated on Jun 29 2026 6:16 PM
ఈ ఏడాది కరుప్పుతో సూపర్ హిట్ కొట్టిన సూర్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుస పెట్టి సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా ఆగస్టులో థియేటర్లలో సందడి చేయనుంది.
అంతలోనే మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు కోలీవుడ్ స్టార్ హీరో. భారీ చిత్రాలు నిర్మించే హోంబలే ఫిల్మ్స్‌తో జతకట్టారు. ఈ సందర్భంగా సూర్యకు ఆహ్వానం పలుకుతూ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జూన్ 29న పూజా కార్యక్రమాలతో మొదలుకానుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
కిల్లి రవి కేసు వెనుక అసలు కథ ఏంటి? పూర్తి వివరాలు!
జేసీ ప్రభాకర్ రెడ్డిపై YSRCP విమర్శల దాడి.. ఏమన్నారంటే?
కూతురు మృతి తర్వాత వచ్చిన ఫోన్ కాల్.. కుటుంబం చెబుతున్న సంచలన విషయాలు!
ఆ రోజు దాడిలో కోడిగుడ్లు, రాళ్లు విసిరింది టీడీపీ గూండాలే
"ఇది అంతా కావాలనే చేస్తున్నారు" అంటే అర్థం ఇదే.. వైరల్ కామెంట్స్!