చాలా మంది ఉదయం లేవగానే ఫోన్ చూస్తారు. సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతారు. దీని వల్ల చాలా సమయం వృథా అవుతుంది. ఆ రోజు చేయాల్సిన పనిని మరుసటి రోజుకు వాయిదా వేయడం వల్ల తర్వాతి రోజు పనిభారం పెరుగుతుంది.
సమయం వృథా అవుతుంది.
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల విలువైన సమయం వృథా అవుతుంది.
ప్రతి రోజూ పనులు చేసేటప్పుడు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఈ రోజు ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవాలి. లేకపోతే సమయం వృథా అవుతుంది.
మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఏ ఒక్క పని కూడా సరిగ్గా పూర్తవదు. సమయం వృథా అవుతుంది. కాబట్టి ఒకసారి ఒక పనిని మాత్రమే చేయండి.
ఫోన్ నోటిఫికేషన్లు, మెసేజ్‌లు ఏకాగ్రతను తగ్గిస్తాయి. పని వేళల్లో నోటిఫికేషన్లను ఆఫ్‌లో పెట్టుకోండి.
ప్రయోజనం లేని సంభాషణలు వద్దు. వీటి వల్ల సమయం వృథా అవుతుంది.
చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సమయం తీసుకుంటే చాలా సమయం నష్టమవుతుంది. చిన్న చిన్న విషయాలకు నిర్ణయాలు త్వరగా తీసుకోండి.
ముఖ్యమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టం వస్తుంది. సమయం వృథా అవుతుంది.