
జూన్ 30న కొత్త టాటా సియెర్రా ఈవీ కారు వచ్చేస్తోంది ఈ కొత్త ఈవీతో సరికొత్త ఈవీ పోర్ట్‌ఫోలియో విస్తరణ ICE మోడల్ మాదిరిగానే, ట్రిపుల్ స్క్రీన్ సెటప్ Tata Sierra EV Launch : కొత్త ఈవీ కారు
కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త ఈవీని జూన్ 30న భారత మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే టాటా సియెర్రాను పెట్రోల్-డీజిల్ (ICE) వేరియంట్లలో ప్రవేశపెట్టింది. టాటా ఇప్పుడు (Tata Sierra EV Launch) టాటా సియెర్రా ఈవీతో సరికొత్త ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. కొత్త టాటా సియెర్రా ఈవీ ముఖ్య ఫీచర్లను ఇప్పుడు పరిశీలిద్దాం.. డిజైన్, లుక్ (అంచనా) : కొత్త టాటా సియెర్రా ఈవీ లుక్ విషయానికి వస్తే.. చాలా వరకు ICE మోడల్ పోలి ఉంటుంది. అయితే, ఈవీలో కొన్ని మార్పులు ఉండొచ్చు. ఎలక్ట్రిక్ కార్లలో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. కొత్త బంపర్, పూర్తి వెడల్పు కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ద్వారా మరింత అడ్వాన్స్ డిజైన్ అందిస్తాయి. కొత్త సియెర్రా ఈవీ బ్యాడ్జింగ్ అందిస్తుంది. కొత్త కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్లైట్లు, కొత్త బ్యాడ్జ్‌లు మరింత ప్రత్యేకంగా ఉంటాయి. కొత్త టాటా సియెర్రా ఈవీ ఇంటీరియర్ గ్రే, బ్లాక్ థీమ్‌తో క్యాబిన్ ఉంటుందని అంచనా. ICE మోడల్ మాదిరిగానే, ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో వస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఫ్రంట్ ప్రయాణీకుడి కోసం స్పెషల్ డిస్ప్లే ఉంటాయి. Read Also : Gold price Crash : పాత బంగారం మీ వద్ద ఉందా?.. ఇప్పుడే అమ్మేస్తున్న జనాలు.. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే కారణమా? కొత్త టాటా సియెర్రా ఈవీ ఫీచర్లు : కొత్త టాటా సియెర్రా ఈవీ అనేక అడ్వాన్స్ ఫీచర్లతో రానుంది.. ADAS (అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ మెమరీ ఫంక్షన్‌తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఎయిర్ క్లీన్ మిషన్స్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ 360 డిగ్రీల కెమెరా పవర్డ్ బూట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు సేఫ్టీ కోసం.. కొత్త సియెర్రా ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో ఏబీఎస్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సీట్ బెల్ట్ రిమైండర్, బ్రేక్ డిస్క్ వైపింగ్ సిస్టమ్ వంటి అనేక అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లను అందించవచ్చు. బ్యాటరీ, రేంజ్ : కొత్త టాటా సియెర్రా ఈవీ 65kWh, 75kWh అనే 2బ్యాటరీ ఆప్షన్లతో వస్తుందని అంచనా. విభిన్న డ్రైవ్ మోడ్లు, టెర్రైన్ మోడ్ కూడా అందిస్తుంది. రేంజ్ పరంగా చూస్తే.. టాటా సియెర్రా ఈవీ సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుంది. ధర (అంచనా) : కొత్త టాటా సియెర్రా ఈవీ ధరను లాంచ్ సమయంలో రివీల్ చేయనుంది. అయితే, సియెర్రా ఈవీ ధర సుమారు రూ. 17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉంటుందని అంచనా.