
మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీది కన్య రాశి. మీది మధ్యస్థ జాతకం. మీ జాతకంలో ధన స్థానంలో చంద్రుడు, కళత్ర స్థానంలో శుక్రుడు యోగించును. శత్రు స్థానంలో రవి- బుధ - కేతువులు ఉన్నారు.
ఈ ప్రభావం వల్ల నరఘోష, నరదృష్టి, శత్రుపీడ అధికంగా ఉంటాయి. అష్టమ గురుడు, వ్యయ స్థానంలో రాహువు ప్రభావం వల్ల మీతో పనులు చేయించుకొని మిమ్మల్ని విమర్శించే జనాల మధ్య గడపాల్సి ఉంటుంది. భాగ్య స్థానంలో శని ప్రభావం మీ జీవితంలో ఆటంకాలను సూచిస్తోంది.
ప్రస్తుతం మీరు రాహు మహర్దశలో ఉన్నారు. దీని ప్రభావం వల్ల ప్రతి పనిలో ఆటంకాలు, అలసత్వం, పని ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 2027 నుంచి మీ జాతకంలో మార్పు వస్తుంది. గురు మహర్దశ ప్రభావం ఏర్పడి జీవితంలో మార్పు, ధన యోగం, శాంతి వంటివి కలుగుతాయి. ప్రస్తుతం మీరు ఎటువంటి హోమాలు, శాంతులు ఆచరించవద్దని సూచిస్తున్నాను. మీ జాతకంలో వ్యాపర యోగం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమైనా సరే ఎక్కువ కాలం అందులో ఉండలేని స్థితి ఉంది. అందువల్ల వ్యాపారపరమైన ఆలోచనలు ఉంటే ప్రయత్నించి ముందుకెళ్లాలని సూచన. ఈ కింది పరిహారాలను పాటించడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు పొందుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.