
వంటగదిలో గాలి, వెలుతురు బాగా తగిలే చోట సిలిండర్‌ను పెట్టాలి. అంతేకాదు, సిలిండర్‌ను ఎప్పుడూ పక్కకు వంచి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
సిలిండర్‌కు కనెక్ట్ చేసే రబ్బర్ హోస్ నుంచే గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వాడకంలో రబ్బర్ హోస్పై పగుళ్లు ఏర్పడి గ్యాస్ లీక్ అవుతుంది. అందుకే హోస్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి.
కేవలం స్టవ్ నాబ్ ఆఫ్ చేస్తే సరిపోదు. వంట పూర్తయ్యాక రెగ్యులేటర్‌ను కూడా ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇది ప్రమాదాల ముప్పును బాగా తగ్గిస్తుంది.
వంటగదిలో గ్యాస్ వాసన వస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత తలుపులు, కిటికీలు తెరిచి గాలి బయటకు వెళ్లేలా చూడాలి.
ప్లాస్టిక్ కవర్లు, టిష్యూ పేపర్లు, నూనె మరకలు పడిన బట్టలను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచొద్దు. ఇవి సులభంగా మంటలు అంటుకునే ప్రమాదాన్ని పెంచుతాయి.
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Jaggery Storage: బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదు
Silver Earrings: ఈ వెండి కమ్మలతో తక్కువ ధరలో ట్రెండీ లుక్..
Peacock Bangles: నెమలి గాజులు చూశారా.. చూస్తే కొనకుండా ఉండలేరు