
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన భావనపాడు తీరంలో, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భావనపాడు (శ్రీకాకుళం), జూన్ 28: శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భావనపాడు తీరంలో, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆదివారం సెలవు దినం కావడంతో టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు భావనపాడు బీచ్‌కు వెళ్లారు. అక్కడ సముద్రంలో దిగి ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి ఇద్దరు విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
సముద్రంలో మునిగి మృతిచెందిన విద్యార్థులు జి.అగస్తీమ(19), ఎస్.యశ్వంత్(18) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఐటీ (IT), సీఎస్ఈ(CSE) విభాగాల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. సెలవు రోజున స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడానికి వెళ్లిన విద్యార్థులు ఇలా శవాలై తేలడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తోటి విద్యార్థుల మరణంతో సదరు కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?
Read Latest AP News And Telangana News And International News And Telugu News