
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Women Health: చాలా మంది మహిళలు.. తరచుగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లేదా తరచుగా టాయిలెట్‌కు వెళ్లడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారం లేదంటే బలహీనమైన జీర్ణక్రియ అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సంకేతం అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదొక తీవ్ర సమస్య. ఈ వ్యాధితో బాధపడేవారికి ప్రేగులు సరిగ్గా పనిచేయవు. కడుపు సంబంధిత సమస్యలు పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. శరీరంలో జరిగే కొన్ని సహాజ మార్పులు, ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో ఐబీఎస్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.
హార్మోన్ల మార్పులు: వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల శరీరంలో ఎప్పటికప్పుడు జరిగే హార్మోన్ల మార్పులు వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే మహిళల పేగులు సున్నితంగా మారుతాయి. ఇది కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నెలసరి సమయం: అయితే చాలా మంది మహిళలు నెలసరి సమయంలో ఎక్కువ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో.. ఈ సమస్య గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాల్లో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇవి జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఒత్తిడి : మన మెదడుకు.. జీర్ణాశయానికి మధ్య సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి అధిక ఒత్తిడి, ఆందోళన లేదా మానసిక వత్తిడికి గురైనప్పుడు, అది జీర్ణాశయంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడి పెరిగినప్పుడు ఐ.బి.ఎస్ లక్షణాలు మరింత ఇబ్బందికరంగా మారతాయి.
పేగుల సమతుల్యత: మన ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే కొన్ని మంచి బాక్టీరియాలు ఉంటాయి. వాటి సమతుల్యతకు భంగం కలిగితే, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఈ మార్పు మహిళల్లో ఐబీఎస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
చికిత్స: కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే.. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. సకాలంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల సమస్యను నిర్ధారించి, సరైన చికిత్సను ప్రారంభిస్తారు. అంతేకాదు.. సమతుల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్ర.. క్రమం తప్పకుండా శారీరక శ్రమ ద్వారా ఐబిఎస్ లక్షణాలను చాలా వరకు నియంత్రించవచ్చు. అందుకే పదేపదే వచ్చే కడుపు సమస్యలను తేలికగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.