
Gulabi Sadi Fame Ananjali Anand Photos: 'గులాబీ సాడి మె తు లగ్ రహీ కమల్' అనే పాట ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పాటలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ పాట పాడిన మరాఠీ నటి పేరు అంజలి ఆనంద్. ఆమె ఆకర్షణీయమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంజలి ఆనంద్ ఎత్తు ఎంత అని కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'గులాబీ సాడి' పాట యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికగా హల్చల్ చేస్తోంది. మల్టీ హీరోల నటనతో రూపొందిన 'ధమాల్ 4' అనే సినిమా జూలై 10వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమాలో రితీష్ దేశ్ ముఖ్ సరసన అంజలి ఆనంద్ నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'గులాబీ చీర' హిందీ వెర్షన్ పాట గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మొదట్లో సీరియల్స్‌లో నటించిన అంజలి, ప్రస్తుతం సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
'ధమాల్ 4' చిత్రంలో రితీష్ దేశ్ ముఖ్ తోపాటు అజయ్ దేవగన్, హర్షద్ వార్సీ, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా, జానీ లివర్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో అంజలి ఆనంద్ గతంలో హిందీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా, ఫీమేల్ లీడ్ సిరీస్ డబ్బా కార్టెల్ లో ప్రధాన పాత్రలతోపాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. స్టార్ ప్లస్ టెలివిజన్‌లో ప్రసారమైన షో ద్వారా ఆమెకు గుర్తింపు లభించింది.
అంజలి ఆనంద్ 1992 జూన్ 12న ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి దినేష్ ఆనంద్ కూడా నటుడే. ఆమె 2017లో 'Untag' అనే వెబ్ సిరీస్‌తో కనిపించగా, 2023లో 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు.
అంతేకాకుండా, ఆమె 'ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 13'రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ 'ధమాల్ 4' సినిమాలోని 'గులాబీ సాడి' పాటతో అంజలి వార్తల్లో నిలిచారు.
ఈ పాటను ఆమె స్వయంగా పాడటమే కాకుండా, స్వరపరిచారు కూడా. ఈ పాటకు గాత్రం అందించడమే కాకుండా వీడియోలో కూడా కనిపిస్తారు. జూన్ 27న ముంబైలో రితీష్ దేశ్ ముఖ్, అంజలి ఆనంద్ ఈ పాటను విడుదల చేశారు.
అంజలి ఆనంద్ తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నటనతో అందరినీ మెప్పిస్తున్నారు. ఆమె ఆరు అడుగుల ఎత్తుతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు.
ఈ పాటకు ఇద్దరూ కలిసి లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చి హోరెత్తించారు. టీ-సిరీస్, దేవగన్ గుల్షన్ కుమార్ సమర్పించిన ఈ చిత్రాన్ని మనోరమ స్టూడియోస్ నిర్మించారు. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.