
ఒకవేళ భారత్, దక్షిణాఫ్రికా తమ తమ మ్యాచ్‌లలో గెలిస్తే, మూడు జట్లకు చెరో 8 పాయింట్లు లభిస్తాయి. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది.
దక్షిణాఫ్రికా కంటే భారత్‌కు కూడా మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది, కాబట్టి గెలుపు వారిని సెమీఫైనల్స్‌కు చేర్చుతుంది.
భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 38 టీ20లలో తలపడగా, ఆస్ట్రేలియా 27, భారత్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఈరోజు తేలనుంది. లార్డ్స్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రెండో మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Australia vs India, Women’s T20 World Cup 2026 Live Score Updates: మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ నుంచి రెండో సెమీఫైనలిస్ట్ ఈరోజు తేలనుంది. లార్డ్స్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
ఆస్ట్రేలియా దాదాపు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. రెండో స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. భారత్ 4 మ్యాచ్‌ల నుంచి 6 పాయింట్లతో +2.268 నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో ఉంది. అయితే, సౌతాఫ్రికా నెట్ రన్ రేట్ +0.734గా ఉంది. ఆస్ట్రేలియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు 38 టీ20లలో తలపడగా, ఆస్ట్రేలియా 27, భారత్ 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.