IPOs This Week : దేశీయ మార్కెట్లో మరోసారి పబ్లిక్ ఇష్యూల సందడి మొదలైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులతో వెనకడుగు వేసిన చాలా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి వస్తున్నాయి.
ప్రైమరీ మార్కెట్లో మరోసారి ఐపీఓల సందడి వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఈ వారం మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే అని చెప్పవచ్చు. భౌగోళిక ఉద్రిక్తతలు చల్లారిన క్రమంలో ఒక్కొక్కటిగా ఐపీఓలకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ వారం మొత్తం 11 కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు వస్తున్నాయి. ఇందులో 2 మెయిన్ బోర్డు ఐపీఓలు ఉండగా మిగిలిన 9 ఎస్ఎంఈ విభాగం నుంచి వస్తున్నాయి. అలాగే ఇప్పటికే సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న మరో 9 కంపెనీలు ఈవారమే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి.ఐపీఓకు వస్తున్న కంపెనీలు ఇవే ఆస్తా స్పింటెక్స్ పబ్లిక్ ఇష్యూ జూన్ 29, 2026 రోజున మొదలవుతోంది. జులై 1వ తేదీతో ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ చూస్తే ఒక్కో షేరుకు రూ. 125- 136గా నిర్ణయించారు. రూ. 170 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. న్యాక్ ప్యాకేజింగ్ ఐపీఓ జులై 1వ తేదీన మొదలై జులై 3వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్ నిర్వహించనుంది. ప్రైస్ బ్యాండ్ రూ. 161- 170గా నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 439.50 కోట్లు సమీకరించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.380 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 59.50 కోట్లు సమీకరించనుంది. ఇక ట్వింకిల్ పేపర్స్, అడోన్ ఆగ్రో కమొడిటీస్, క్రిటికల్ టెక్ ఐపీఓ, తేజ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్, అథర్వ పాలీప్లాస్ట్, సంపర్క్ ఇండియా లాజిస్టిక్స్, సీమ్యాక్స్ రిసోర్సెస్, వినిత్ మొబైల్, ఐసీ ఎలక్ట్రికల్స్ ఎస్ఎంఈ కేటగిరీలో జూన్ 30 నుంచి జులై 2 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కి వస్తున్నాయి.లిస్టింగ్స్ అయ్యే కంపెనీలు ఇవేటర్టిల్మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్ జూన్ 29వ తేదీ లిస్టింగ్ అవుతోంది. ఇక వాటర్ వేస్ లీజర్ టూరిజం ఐపీఓ, అధ్వైత్ జువెల్స్ జులై 1వ తేదీన, సీఎస్ఎం టెక్నాలజీస్ జులై 2వ తేదీన లిస్టింగ్ అవుతున్నాయి. రియాసత్ లైఫ్ స్టైల్, అనుభవ్ ప్లాస్టో, జివైల్ ఇండస్ట్రీస్, శ్రీధర్ స్పిన్నర్స్, శ్రీ ప్రియాంక జియో కామెక్స్, క్రేజీ స్నాక్స్ పబ్లిక్ ఇష్యూలు ఎస్ఎంఈ కేడగిరీలో లిస్టింగ్ అవుతున్నాయి.ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం అందించడానికి మాత్రమే. ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుందని గమనించాలి. ఎంచుకునే స్టాక్, కంపెనీ గురించి తెలుసుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.