
Jinisha Alishetty : పలువురు సినీ సెలబ్రిటీలు విదేశాలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా తమ వస్తువులు పోగొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
తాజాగా ఓ కొత్త హీరోయిన్ ఏకంగా 4 లక్షల విలువైన సూట్ కేసులు పోగొట్టుకుంది. జినీషా అనే నటి హ్యాపీ జర్నీ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది.
అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని, పాయల్ రాధాకృష్ణ, రవి శివతేజ, వంశీ, జినీషా, రూప.. ఇలా చాలా మంది ఆర్టిస్టులతో ఈ హ్యాపీ జర్నీ సినిమా తెరకెక్కుతుంది. ఇంతమంది కలిసి పారిస్ వెళ్లి ఏం చేసారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పారిస్ లోనే జరిగింది. దాదాపు 22 రోజులు ఆర్టిస్టులు అంతా పారిస్ లోనే ఉండి సినిమా షూట్ పూర్తి చేశారు.
Also See : Roja Son Krishna Kowshik : గ్రాండ్గా రోజా కొడుకు 20వ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
తాజాగా హ్యాపీ జర్నీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో నటి ఝాన్సీ మాట్లాడుతూ.. పారిస్ లో దిగగానే మా అమ్మాయి(జినీషా) సూట్ కేసులు కొట్టేసారు. దాదాపు 4 లక్షల విలువైన వస్తువులు, డ్రెస్ లు ఉన్న సూట్ కేసులు కొట్టేసారు అని తెలిపింది. దీనిపై జినీషాని ప్రశ్నించగా.. నేను కొంచెం నీట్ గా రెడీ అయి వచ్చాను. ఇప్పుడు ఏడిస్తే బాగోదు అంటూ ఆ ఘటనను తలుచుకొని ఎమోషనల్ అయింది.
అయితే జినీషా పారిస్ లో దిగగానే దాదాపు 4 లక్షల విలువ గల డ్రెస్ లు, తన వస్తువులు ఉన్న సూట్ కేసులు పోగొట్టుకోవడంతో ప్రొడక్షన్ టీమ్ ఆమెకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసారని సమాచారం.