
Pune fort murder| ఇంటర్నెట్‌డెస్క్: పుణె బిజినెస్‌మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీన్ రీక్రియేషన్ కోసం ఘటన జరిగిన లోహ్‌గఢ్ కోటకు నిందితురాలు సియా గోయల్‌ను పోలీసులు తీసుకెళ్లారు. కేతన్ చనిపోవడానికి ముందు (Ketan Agarwal Murder Case) ఘటనాస్థలంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ఒక డమ్మీని ఉపయోగించారు. సియాను కోటవద్దకు తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘ఈ రోజు ఉదయం ఘటనాస్థలం సీన్ రీక్రియేషన్ చేపట్టాం. నిందితురాలిని, ఒక డమ్మీ బాడీని అక్కడకు తీసుకెళ్లాం. కేతన్‌ను ఎలా తోసివేశారో చూపించాలని సియాను అడిగాం. నేరం జరిగిన ప్రాంతానికి వెళ్లిన మార్గాన్ని ఆమె చూపించింది’’ అని పోలీసులు వెల్లడించారు. మరోవైపు సీన్ రీక్రియేషన్ కోసం చేతన్‌ను విడిగా తీసుకెళ్తామని చెప్పారు. పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ నేరాన్ని ఎలా ప్లాన్ చేశారు..? ఘటన జరగానికి ముందు, తర్వాత నిందితులు ఏం చేశారు..? వారి ఆన్లైన్ యాక్టివిటీ, హత్యకు గల కారణాలపై లోతుగా పరిశీలిస్తున్నారు.
కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే.. చేతన్‌తో కలిసి అతడి అడ్డుతొలగించుకునేందుకు ఈ నేరానికి పాల్పడినట్లు సియా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్ పేరును తరచూ ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బంధానికి అడ్డుగా ఉండడంతో తన కుమారుడిని హత్య చేశారని ఈ నెల 23న కేతన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్‌పై కేసు నమోదు చేశారు. గతంలో నిందితులిద్దరు క్రికెట్ మ్యాచ్‌కు హాజరైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సియా సోదరుడి ద్వారానే ఆ ఇద్దరికీ పరిచయం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.