
అరుంధతిగా భయపెట్టినా.. దేవసేనగా రాజసం చూపించినా.. భాగమతిగా మెప్పించినా.. అది కేవలం ఆమెకే చెల్లింది. ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చూస్తుండగానే తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది
స్వీటీ అనుష్క శెట్టి.
అరుంధతిగా భయపెట్టినా.. దేవసేనగా రాజసం చూపించినా.. భాగమతిగా మెప్పించినా.. అది కేవలం ఆమెకే చెల్లింది. ‘సూపర్’ (Super Movie) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చూస్తుండగానే తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది స్వీటీ అనుష్క శెట్టి (Sweety Anushka Shetty). లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోలకు దీటుగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకుంటూ వస్తోంది. ‘బాహుబలి 2’ (Bahubali 2) లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత అందరి కెరీర్ జెట్ స్పీడ్‌లో వెళ్తుంటే, స్వీటీ జోరు మాత్రం బాగా తగ్గిపోయింది. ఇక త్వరలో టాలీవుడ్‌కు పూర్తి స్థాయిలో గుడ్‌బై చెప్పనుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.
‘బాహుబలి’ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ హీరోయిన్‌కు దక్కని రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుంది అనుష్క. అలాంటి చారిత్రక విజయం తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అందరూ ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా ఆమె సినిమాల వేగం పూర్తిగా తగ్గిపోయింది. గతేడాది ‘ఘాటి’ సినిమాలో తనదైన మార్క్ చూపించిన స్వీటీ.. ప్రస్తుతం మలయాళంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘కథనార్’ చిత్రంతో బిజీగా ఉంది. ఒక పక్క సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆమె మునుపటిలా యాక్టివ్‌గా లేరన్నది మాత్రం వాస్తవం. సినిమా ప్రమోషన్స్‌కు మినహా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. ఈ మధ్య కాలంలో అనుష్కను పబ్లిక్ ఈవెంట్స్‌లో చూడటం కష్టంగా మారిపోయింది. మీడియా ఇంటరాక్షన్స్కు, ఇంటర్వ్యూలకు ఆమె వీలైనంత దూరంగా ఉంటున్నారు. అసలు స్వీటీని బయట చూడటం అసాధ్యం అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అభిమానులు కూడా తమ అభిమాన నటిని స్క్రీన్ పైన లేదా కనీసం బయట కూడా చూడలేక తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. పబ్లిక్ లైఫ్‌కు ఇంతలా దూరం జరగడానికి కారణం ఏమిటన్నది అనుష్కకే తెలియాలి.
అయితే మరో వైపు దీనికంతటికీ మూల కారణం ‘సైజ్ జీరో’ (Size Zero) సినిమానే అని ఆమె ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. పాత్ర కోసం ప్రాణం పెట్టే డెడికేషన్‌తో, ఎలాంటి ఆర్టిఫిషియల్ పద్ధతులు వాడకుండా న్యాచురల్‌గా బరువు పెరిగింది అనుష్క. కానీ ఆ తర్వాత బరువు తగ్గడానికి, మళ్లీ స్లిమ్‌గా మారడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కఠినమైన వర్కవుట్లు, డైట్లు ఫాలో అయినా ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇక రీసెంట్గా ‘బాహుబలి టార్చ్ బేరర్’కి సంబంధించిన ఒక వీడియోలో అనుష్కను చూసి ఆమె అభిమానులు కూడా మురిసిపోతున్నారు. అయితే, ఆ వీడియో కూడా కిందటి ఏడాదే షూట్ చేసిందని తెలియడంతో.. అసలు ప్రస్తుతం స్వీటీ ఎలా ఉందో చెప్పడం కష్టంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల నడుమ, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అనుష్క ఇక తెలుగులో సినిమాలు చేయడం దాదాపు కష్టమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు యంగ్ హీరోయిన్ల రాకతో ఇండస్ట్రీలో విపరీతమైన పోటీ పెరిగింది. అలాగే కుర్ర భామల హవా నడుస్తుండటంతో అనుష్కకు క్రేజ్ కాస్త తగ్గిందనే విమర్శలు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. వందల కోట్లు వసూలు చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు టాలీవుడ్లో ఇప్పటికీ కేరాఫ్ అడ్రస్ అనుష్క మాత్రమే. కథలో దమ్ముంటే.. స్టార్ హీరోలకైనా, బడా డైరెక్టర్లకైనా ది బెస్ట్ ఛాయిస్ స్వీటీనే. ట్రెండ్స్ మారొచ్చు, కొత్త ముఖాలు రావొచ్చు.. ఇంకా ఎన్నో పుకార్లు పుట్టుకురావచ్చు.. కానీ టాలీవుడ్ జేజమ్మ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. భవిష్యత్తులో ఆమె తనదైన సాలిడ్ కమ్ బ్యాక్‌తో అందరి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి.
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!
Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..
Naga Chaitanya: నా కెరీర్లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే