
Sonam Wangchuk | దిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సంఘీభావం ప్రకటించారు.
జంతమంతర్లో నిరాహారదీక్ష ప్రారంభించారు. నీట్ పరీక్షలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ జూన్ 20 నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆదివారం వాంగ్‌చుక్ సహా వందలాది మంది ఉద్యమకారులు, విద్యార్థులు, రైతు సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాతా నిరాహార దీక్షను ప్రారంభించారు. దీక్ష ప్రారంభానికి ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి వాంగ్‌చుక్ రాజ్‌ఘట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌కు చెందిన కొందరు రైతు సంఘం నాయకులను జంతర్ మంతర్ వద్దకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారని అభిజీత్ దీప్కే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఒక్క పరీక్ష కోసం చేసే ఉద్యమం మాత్రమే కాదని.. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఉద్యమంగా పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు.
పెళ్లి పత్రికల సేకరణతో గిన్నిస్ రికార్డు సాధించిన కేరళ వాసి.. తన కుమారుడి వివాహానికి వినూత్నమైన శుభలేఖను ఎంచుకున్నారు.