
కాజులూరు: తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలోని దుగ్గుదూరు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 23 మంది అస్వస్థతకు గురయ్యారు.
రహదారి పక్కన బండిలో విక్రయించే బజ్జీలు తినడంతో వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక దుగ్గుదూరు పీహెచ్సీలో కొందరు చికిత్స పొందుతుండగా.. మరికొందరు డిశ్చార్జి అయ్యారు. బజ్జీలు తిని 23 మందికి అస్వస్థత.. |