
ఇంటర్నెట్ డెస్క్: ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో, షాహిద్ కపూర్ (Shahid Kapoor), కరీనా కపూర్ (Kareena Kapoor) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జబ్ వి మెట్’ (Jab We Met).
ఈ మూవీ బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. షాహిద్ కపూర్ పోషించిన ‘ఆదిత్య కశ్యప్’ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమా తెరకెక్కడానికి అసలు కారణం షాహిద్ కపూరేనని దర్శకుడు ఇంతియాజ్ అలీ వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంతియాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘జబ్ వి మెట్’ వచ్చింది షాహిద్ వల్లే. నేను ఈ సినిమా మొదట బాబీ దేవోల్‌తో చేయాలనుకున్నా. కానీ, కుదరలేదు. ఆ తర్వాత వేరే సినిమా కోసం షాహిద్‌ను కలిశా. అప్పుడు ఆయన అబ్బాయి-అమ్మాయి పరిచయంతో మొదలయ్యే కథ ఏమైనా ఉందా?అని అడిగారు. దాంతో ‘జబ్ వి మెట్’ను షాహిద్‌కు చెప్పా. ఆయన బాగా నచ్చింది. ‘మరి ఈ సినిమా మనం ఎందుకు చేయకూడదు’ అన్నారు. అలా ఈ మూవీ పట్టాలెక్కింది’’ అని ఇంతియాజ్ తెలిపారు. 2007లో విడుదలైన ‘జబ్ వి మెట్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం షాహిద్ ‘కాక్టైల్ 2’ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగా, ఇంతియాజ్ ‘మై వాపస్ ఆవూంగా’తో హిట్ కొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’(Idupu Kayitham). వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇటీవల ప్రారంభమైంది.