
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva)తో రూపొందనున్న #NBK112 (కొన్ని వర్గాల్లో #NBK111గా కూడా ప్రచారం) కథ ఇప్పటికే ఫైనల్ దశకు చేరుకుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ అద్భుతంగా వచ్చిందని, బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగానే కాకుండా ఆయనను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించేలా కొరటాల స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.
కొరటాల శివ సినిమాలకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన స్ట్రాంగ్ సోషల్ మెసేజ్, ఎమోషనల్ డ్రామా, పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఈ కథలో కూడా మెయిన్ ఎట్రాక్షన్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు ఆడియన్స్ ను ఎమోషన్స్ కు గురిచేసే సీన్స్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా వెలువడకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ సమాచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కథ అనుకున్న స్థాయిలో తెరపై ఆవిష్కృతమైతే, బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.