పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే, ఆస్టర్ ఆర్వి హాస్పిటల్, బెంగళూరు...
పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే, ఆస్టర్ ఆర్వి హాస్పిటల్, బెంగళూరు తెలిపారు.
వెల్లుల్లి, ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. వీటిలో ఉండే సమ్మేళనాలు జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. వీటిని తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
అరటిపండ్లులో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ కూడా లభిస్తుంది. అరటిపండ్లు తింటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఓట్స్‌లో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది కరిగే ఫైబర్. ఓట్స్ తినడం వల్ల మంచి బ్యాక్టీరియా వృద్ధి బాగా జరుగుతుంది.
బీన్స్, బఠానీలు, పప్పు ధాన్యాల్లో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే జీర్ణాశయంలో గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉంటుంది.
కిమ్చీ, సౌర్‌క్రాట్, కెఫిర్ వంటి వాటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి.
యాపిల్‌లో పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కరిగే ఫైబర్. యాపిల్ తినడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది.
దానిమ్మలో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతాయి.
మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.