
టెకీ రాధాగాయత్రి (Radha Gayatri) అనుమానాస్పద మృతి కేసులో ఆమె తండ్రి సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. చంపాలనే పక్కా ప్రణాళికతోనే రాధాగాయత్రిని భర్త శ్రీచరణ్ మసూరీ తీసుకెళ్లాడన్నారు.
‘‘శ్రీచరణ్ అందరినీ తప్పుదారి పట్టించాడు. ముందస్తు ప్లాన్‌తోనే మా అమ్మాయిని హత్య చేశాడు. ఉదయం 6.30 గంటలకు చనిపోయినట్లు నాకు 8.10 గంటలకు కాల్ చేశాడు. టికెట్లు పంపిస్తున్నాను.. వచ్చేయండని చెప్పాడు. అంతకుముందు ఎంతోమందితో సంప్రదింపులు జరిపాడు. ఉత్తరాఖండ్‌లో లాయర్‌ను కూడా పెట్టుకున్నాడు. శ్రీచరణ్ తన మొబైల్ స్విచాఫ్ చేసి ప్రస్తుతం విశాఖలోనే తిరుగుతున్నాడు. తల్లిదండ్రులే అతడిని పోలీసులకు అప్పగించాలి’’ అని సుధాకర్ అన్నారు. ఈ వార్త చదివారా: గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఘోర ప్రమాదం: ఇద్దరి మృతి