
త్యాగనిరతి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు.
ముహమ్మద్ (Muhammad) ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (Hazrat Imam Hussain) బలిదానాన్ని సంస్మరణగా మొహరం జరుపుకుంటారని గుర్తుచేశారు. తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ-ముస్లిం (Muslims)లు కలిసి పీర్ల (Peerla) ఊరేగింపు నిర్వహిస్తారని గుర్తు చేసుకున్నారు. ఈ సంస్మరణ తెలంగాణ ప్రాంతంలో గంగా జమునా తెహజిబ్ విధానానికి గొప్ప నిదర్శనమని చెప్పారు. మొహరం సందర్భంగా రాష్ట్రంలో హిందూ ముస్లింలు ఐక్యంగా... శాంతియుతంగా పీర్ల ఊరేగింపు నిర్వహించుకోవాలని సీఎం కోరారు. ఈ తెలంగాణ ప్రాoతoలో కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు, ఐక్యతకు వారధిగా మొహరం నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునర్ ఉద్ఘాటించారు.