
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Thalassemia: తలసేమియా.. ఈ వ్యాధి గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ దీన్ని చిన్న సమస్యగా భావించకూడదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరినైనా ప్రభావం చేసే జెనెటిక్ రక్త వ్యాధి. అందుకే పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి జాతకాలు కలవకున్నా పర్వాలేదు కానీ ఇద్దరూ తలసేమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో దేశంలో తలసేమియా కేసులు భారీగా పెరుగుతుండటం.. కలవరపెడుతోంది. ఈ వ్యాధి శరీరంలో సరిపడా రక్తాన్ని తయారు చేయలేకపోతుంది. అంటే తలసేమియా బారినపడి వ్యక్తి శరీరం తనంతతాను రక్తాన్ని రీప్రొడక్ట్ చేసుకోదు. దీంతో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ సరైన స్థాయిలో అందదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఈ తలసేమియా అనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఆల్ఫా తలసేమియా, 2. బీటా తలసేమియా.
1. ఆల్ఫా తలసేమియా అనేది సైలెంట్ క్యారియర్. ఈ వ్యాధి ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించవు. వీరు వ్యాధిని వ్యాప్తి చేసే వాహకాలుగా మాత్రమే ఉంటారు. ఆల్ఫా తలసేమియా ట్రైయిట్ లేదా మైనర్.. ఇది తేలికపాటి రక్తహీనత ఉంటుంది. సాధారణంగా ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దాని తీవ్రత పెరుగుతుంది. మధ్యస్థం నుంచి తీవ్రమైన రక్తహీనత, ఎముకల సమస్యలు, ప్లీహం వాపు వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఆల్ఫా తలసేమియా మేజర్..అనేది అత్యంత తీవ్రమైన రూపమని వైద్యులు చెబుతున్నారు. దీన్ని హైడ్రోప్స్ ఫెటాలిస్ అని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా గర్భంలోనే లేదా పుట్టిన వెంటనే ప్రాణాంతకంగా మారుతుంది.
2. బీటా తలసేమియా మైనర్ ఇది తేలికపాటి రక్తహీనత ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న రోగి సాధారణ జీవితం గడపవచ్చు. వీరు కేవలం జన్యువాహకాలుగా మాత్రమే ఉంటారు. అయితే బీటా తలసేమియా ఇంటర్మీడియా అనేది మైనర్, మేజర్ మధ్యస్థాయి లక్షణాలను కలిగి ఉంటుంది. వీరి శరీరం రక్తాన్ని పునరుత్పత్తి చేసుకోదు. అందుకే రక్త మార్పిడి అవసరం ఉంటుంది. బీటా తలసేమియా మేజర్.. దీన్ని కూలీస్ అనీమియా అని పిలుస్తుంటారు. ఇది చాలా తీవ్రమైంది. రోగులు జీవించేందుకు క్రమం తప్పకుండా జీవితాంతం రక్తాన్ని మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈమధ్యకాలంలో దేశంలో ఈ తలసేమియా కేసులు పెరుగుతుండటంతో.. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడంతో... పెళ్లి తర్వాత ఈ వ్యాధి లక్షణాలు పిల్లల రూపంలో బయటపడుతున్నాయి. తల్లిదండ్రులకు ఇద్దరికీ తలసేమియా లక్షణాలు ఉన్నట్లయితే.. పుట్టే బిడ్డకు తలసేమియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే పెళ్లికి ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నార. చాలా మంది గైనకాలజిస్టులు.. మొదటి గర్బం దాల్చిన సమయంలో ఈ టెస్ట్ చేయిస్తున్నారు. ఆ సమయంలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెళ్లికి ముందే జంటలు ఈ టెస్టులు చేయించుకున్నట్లయితే ముందస్తుగా గుర్తించవచ్చని చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచుగా రక్తహీనత, బలహీనంగా ఉండటం, తొందరగా అలసిపోవడం సాధారణ వ్యక్తి 2 గంటలపాటు పనిచేసి అలసిపోతే.. తలసేమియా బాధితులు 1గంటసేపట్లోనే అలసిపోతుంటారు.. ఎత్తు పెరగరు.. బరువు పెరగడం, తగ్గడం, చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది.. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అంతేకాదు కొంతమందిలో ఎముకలు ఆకారం మారుతుంది. ముఖ ఆకారం మారుతుంది. తీవ్రమైన తలసేమియా ఉన్నవారిలో తరచుగా రక్తాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాధి గ్రస్తులకు చికిత్సను ఆలస్యం చేసినట్లయితే గుండె, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎముక మజ్జ మార్పిడి కూడా చేయాల్సి వస్తుందంటున్నారు. దీని ద్వారా శాశ్వత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నాుు. అయితే చాలా మందికి నిరంతర చికిత్స, వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది.
ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకునేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా ఒత్తిడికి గురికాకూడదు. ఎక్కువగా ఆలోచిస్తుంటే.. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి గుండెపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందుకే పెళ్లికి ముందు తలసేమియా స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. తలసేమియా గురించి అవగాహన ఉన్నట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా వరకు నివారించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.