
ఫ్రాన్స్‌లో ఏసీల కోసం జనం ఎగబడుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఏసీలు, కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
వాటి కోసం దుకాణాలు తెరవకముందే క్యూ కడుతున్నారు. చాంబరీలోని ఒక దుకాణం తలుపులు తెరిచిన వెంటనే పెద్దసంఖ్యలో కస్టమర్లు లోపలికి దూసుకెళ్లారు. ఉపకరణాల చుట్టూ గుమిగూడి వాటిని తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. నిర్వాహకులు చేసేదేమీ లేక చూస్తుండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ACల కోసం ఎగబడుతున్నారు.. ఎక్కడంటే? |