
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Food To Boost Immunity In Monsoon: కొన్ని రోజులుగా మనం తీవ్రమైన వేడిని అనుభవిస్తున్నాం. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల కొంచెం ఉపశమనం లభిస్తోంది. వర్షాల వల్ల నీటి కొరత తగ్గుతుంది. పంటలు పండుతాయి. కానీ, వర్షాకాలం రాగానే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. నీటి నిల్వలు, అపరిశుభ్రత కారణంగా ఈగలు, దోమలు పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వేగంగా వ్యాపిస్తాయి. అందుకే, బయట దొరికే ఆహారం తినకుండా, ఇంట్లోనే వండుకున్న వేడివేడి పదార్థాలనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, వ్యాధులను ఎదుర్కోవడానికి మీ ఇమ్యూనిటీతో పాటు జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండాలి.
వర్షాకాలంలో వ్యాధులు సోకినప్పుడు అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, పేగు ఆరోగ్యం బాగుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం తాగే నీరు ఎప్పుడూ వేడి చేసి తీసుకోవాలి. ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వర్షాకాలంలో మీ డైట్లో చేర్చుకోవాల్సిన ఆహారాలు... ఈ సీజన్లో మార్కెట్లో యాపిల్స్, పియర్స్, దానిమ్మ, ప్లంస్, జామున్ వంటి పండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు బాగా పండుతాయి. వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇమ్యూనిటీ వ్యవస్థ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యం బాగుంటుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉన్న ఆహారాలపై దృష్టి పెట్టండి.
వర్షాకాలంలో గోరువెచ్చని సూప్స్ తాగడం చాలా మంచిది. ఉడికించిన కూరగాయలు, చికెన్ లేదా పప్పులతో చేసిన సూప్‌లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది.
ఈ సమయంలో శరీరానికి ప్రోటీన్ కూడా ఎంతో అవసరం. ఇది ఇమ్యూనిటీని పెంచి, బాడీ టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. గింజలు, బీన్స్, పప్పులు, చేపలు మరియు పన్నీరు వంటివి తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
అంతేకాకుండా, ప్రోబయోటిక్ ఆహారాలు కూడా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ వంటివి కడుపుకు మంచివి. ఇమ్యూనిటీని పెంచుతాయి.
వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు కూడా ఈ కాలంలో ఉపయోగపడతాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటివి మీ డైట్లో చేర్చుకోండి. ఇవి సహజమైన ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేస్తాయి.
వర్షాకాలంలో తినకూడని ఆహారాలు... వర్షాకాలంలో తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే వీటి వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. నీటి కాలుష్యం వల్ల కూడా ఇటువంటి ఆహారాలు తీసుకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అలాగే నూనెలో వేయించిన పదార్థాలైన పకోడీలు, సమోసాలు, చిప్స్ వంటివి ఎక్కువగా తినకూడదు. వీటి వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యలు రావచ్చు. వీటన్నిటితో పాటు, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.