
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఖుష్బూ సుందర్ వెలుగు వెలిగారు. 80.90 దశకాలలో ఆమె నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించారు. తెలుగులో ఆమె నటించిన చాలా చిత్రాలు ఉన్నాయి.
స్టాలిన్ మూవీలో చిరంజీవికి అక్కగా, యమదొంగ చిత్రంలో యముడికి భార్యగా గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.
ఖుష్బూ కుమార్తె అవంతిక వివాహ వేడుక గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సౌత్ స్టార్లు మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఖుష్బూ సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు. దీనితో ఆమెకి సర్కిల్ బాగానే ఉంది.
టాలీవుడ్ నుంచి ఈ వివాహ వేడుకకి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తమ సతీమణులతో కలసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో వీరి దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ తొలి చిత్రం కలియుగ పాండవులు లో ఖుష్బూ హీరోయిన్ గా నటించారు. ఆమెకి కూడా తెలుగులో ఇది డెబ్యూ చిత్రమే.
ఇక నాగార్జునతో కెప్టెన్ నాగార్జున్, కిరాయి దాదా లాంటి సినిమాల్లో నటించారు. ఈ పెళ్లి వేడుకకు త్రిష కూడా హాజరైంది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ తో లింక్ అప్ రూమర్స్ మొదలైనప్పటి నుంచి త్రిష పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తమ భార్యలతో సందడి చేయగా త్రిష మాత్రం ఒంటరిగా ఒక పక్కన కూర్చున్నారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. చిరంజీవితో త్రిష మాట్లాడుతూ కనిపించింది. వీరిద్దరూ విశ్వంభర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.