
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’లో మన దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది.
దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. వారి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ (National War Memorial)అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది.
‘ఆపరేషన్ సిందూర్’లో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందారు. వీరి పేర్లను దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్లో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు. ఆ అమరుల వివరాలు ఇలా..
వీరిలో రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌ను కేంద్రం మరణానంతరం మూడో అత్యున్నత యుద్ధ పురస్కారమైన ‘వీర చక్ర’తో సత్కరించింది. ఇక, సార్జెంట్ సురేంద్ర కుమార్‌ను ‘వాయు మెడల్’తో గౌరవించింది. ఇక, వీరిలో మురళీ నాయక్ తెలుగు వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన మురళీ.. 2022లో అగ్నివీర్‌గా ఎంపికై తొలుత పంజాబ్, అస్సాంల్లో పనిచేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాక్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ విరుచుకుపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.