
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Ram Temple Donation Theft Case: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుక్రవారం రిమాండ్‌కు పంపే అవకాశం ఉంది. ఈ కుట్రలో నిందితుల పాత్రపై విచారణ జరుగుతోంది. వీరు ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, షిఫ్ట్ వారిలుగా పనిచేస్తూ, సీసీటీవీ కెమెరాలకు అడ్డుగా నిలిచి, ఫూటేజీ తొలగించి, క్యాష్ కౌంట్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు నొక్కి సీసీ టీవీకి అడ్డుగా ఉంటూ నొక్కేశారు. 30 నిమిషాల వ్యవధిని ఉపయోగించుకుని దొంగతనానికి పాల్పడ్డారు. సాధారణ జీతం తీసుకునే ఈ ఉద్యోగులు విలాసవంతమైన వాహనాలు, ఆస్తులను సంపాదించారని సిట్ కూడా గుర్తించింది.
ఆపరేషన్ 30 మినిట్స్.. 'ఆపరేషన్ 30 మినిట్స్' పేరుతో జరిగిన ఈ దొంగతనం అత్యంత పకడ్బందీగా జరిగింది. నగదు లెక్కింపు సిబ్బంది షిఫ్ట్ మారడానికి సరిగ్గా ముందున్న 30 నిమిషాల సమయంలోనే ఈ అక్రమాలు జరిగాయని దర్యాప్తులో తేలింది. కొత్త టెల్లర్ల బృందం వచ్చే ముందు ఈ పక్రియను వీరు ముగించేవారు. ఈ దొంగతనాలకు ప్రధాన నిందితుడు రామశంకర్ యాదవ్ (తిన్ను). ఈయన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాజీ డ్రైవర్. ఆలయ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ, విరాళాల పెట్టెల తాళాలు కూడా ఈయనే ఉంచుకునేవారు. మరో నిందితుడు అనుకల్పు మిశ్రా నగదు లెక్కింపులో కీలక పాత్ర పోషించారు. ఈయన కౌషలాపురిలోని నివాసం నుండి సుమారు రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇతని బావమరిది లవకుశ మిశ్రా కూడా ఈ కుట్రలో భాగస్వామి, ఇతని వద్ద నుండి రూ.10 లక్షలు లభించాయి. తిన్ను యాదవ్ అల్లుడైన మనీష్ యాదవ్ కూడా ఇందులో సూత్రదారే, ఇతని వద్ద నుండి కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సుభాష్ శ్రీవాత్సవ కెనరా బ్యాంకు నుండి రిటైర్ అయ్యి, ప్రస్తుతం ట్రస్ట్ ఉద్యోగిగా నగదు లెక్కింపు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అవినాష్ శుక్ల అనే వ్యక్తి నుండి రూ.5 లక్షలు, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా అనే వ్యక్తులు కూడా ఈ నిధుల దుర్వినియోగంలో భాగస్వాములమయ్యారు. అంతేకాదు ఆ సీసీటీవీ ఫుటేజ్ నుండి తప్పించుకోవడానికి ఆలయ భద్రత రికార్డింగ్ కూడా తారుమారు చేశారు. ఆలయ భద్రత వ్యవస్థ ప్రతి 45 రోజులకు ఫుటేజ్‌ను ఓవర్రైట సెట్ చేశారు. దీనివల్ల పదే పదే ఒక లోపం ఏర్పడి నేరస్తుల నెట్వర్క్ చాలా కాలం పాటు ఏ భయం లేకుండా కొనసాగించారు. జేబుల్లో కరెన్సీ విలువైన వస్తువులను తస్కరించారు. విరాళాలుగా సమర్పించిన వెండి పూలమాలలు, పవిత్ర పాదముద్రలు అనేక విలువైన కానుకలు అధికారిక జాబితా పత్రంలో ఎన్నడూ నమోదు కాలేదు రాతపూర్వకంగా కూడా ఆధారాలు లేవు..
మొత్తం రామ మందిర నిధులలో సుమారు రూ. 7.5 కోట్ల వరకు దుర్వినియోగం జరిగిందని అయోధ్య మాజీ ఎస్పీ పవన్ పాండే ఆరోపించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరిక మేరకు దర్యాప్తు మొదలైంది. ఈ భారీ కుంభకోణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక ఎస్ఐటీ (SIT) బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.