
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Sub-Registrar Sucharitha Disproportionate Assets Case: అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది.. 30 లక్షల భారీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి.. ఇప్పటికే సస్పెన్షన్‌ను గురైన సబ్ రిజిస్ట్రార్ తుమ్మ కొమ్మ సుచరిత లీలలు ఒక్కటి ఒక్కటిగా బయట పడుతూ ఉన్నాయి. తాజాగా ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ(ACB) అధికారులు, ఆమె నివాసాలతో పాటు కార్యాలయాలపై ఏకకాలంలో సోదరులు నిర్వహించారు. ఈ సోదరులు తేలిన ఆస్తుల విలువ చూసి స్వయంగా అధికారులే ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది..
రూ. 5.05 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు.. కేవలం ప్రభుత్వ జీతం పై ఆధారపడి ఒక అధికారిని ఇంత స్వల్ప కాలంలో కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టిందని కోణంలో ఏసీబీ ఆరా తీస్తూ వస్తుంది.. ప్రాథమిక సోదాల ప్రకారం.. ప్రస్తుతం సుచరిత పేరిట.. సుమారు రూ.5.05 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ విలువల ప్రకారమే ఈ ఆస్తులు ఉంటే.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ పదులకోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు..
వజ్రాల వెలుగులు.. లగ్జరీ కార్ల జోరు.. సోదాల్లో దొరికిన ఆస్తుల వివరాలు చూస్తే సుచరిత లగ్జరీ లైఫ్ కు ఎంతగానో అలవాటు పడిందని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె ఇంట్లో లభ్యమైన బంగారంతో పాటు వజ్రాభరణాల విలువ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. రూ.1.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు అరుదైన వజ్రాలను ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రూ.12 లక్షల వరకు లిక్విడ్ క్యాష్ తో పాటు వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.38 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు.. మరో రెండు ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో 2.17 ఎగురాల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు వోక్స్వ్యాగన్ (Volkswagen) లగ్జరీ కార్ తో పాటు మరొక కారు ఉన్నట్లు తెలుస్తోంది.
సస్పెన్షన్ నుంచి జైలు ఊచల వైపు.. గతంలో రూ.30 లక్షల లంచం కేసులో దొరికిపోయినప్పుడే ఈమె అవినీతి సామ్రాజ్యంపై అధికారులకు అనుమానాలు వచ్చాయి. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే ఆదాయానికి మించిన ఆస్తుల కోణాన్ని పరిశీలించగా.. ఊహించని స్థాయిలో నల్లధనం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.. సబ్ రిజిస్టర్ హోదాను అడ్డం పెట్టుకొని.. పెద్ద ఎత్తున భూములతో పాటు రిజిస్టర్లలో అక్రమాలకు పాల్పడి.. ఈ సొమ్ము వెనకేసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ ఆస్తులు అన్నింటిని సీజ్ చేసిన ఏసీబీ.. కేసును మరింత లోతుగా విచారిస్తోంది. లంచగొండి అధికారులకు ఈ కేసు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.