
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామ దేవత మావూళ్లమ్మకు 50 కిలోల బంగారంతో చీర చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఆలయంలో స్వర్ణ వస్త్రనిధి కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు.
అమ్మవారికి నిలువెత్తు బంగారం చేయించాలని 2009లో సంకల్పించగా.. ఇప్పటివరకు 74 కిలోల బంగారం విరాళంగా వచ్చిందని వెల్లడించారు. అందులో 50 కిలోలతో అమ్మవారికి నగలు చేయించామని చెప్పారు. మిగిలిన 24 కిలోలకు మరో 30 కిలోల బంగారం అదనంగా కలిపి అమ్మవారికి స్వర్ణవస్త్రం చేయిస్తున్నామని తెలిపారు. ఈ వార్త చదివారా: క్యాషియర్ నిజాయతీ.. పెళ్లింట ఆనందం