
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ -సర్) సర్వ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి జులై 24 వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా హిమాయత్ నగర్ (Himayat Nagar) వార్డు కార్యాలయంలో బిఎల్ఓ (BLO)లకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు అందజేశారు. బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అందజేస్తారు. ఓటర్లే ఈ దరఖాస్తులను పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని అధికారులు తెలిపారు. రెండు రోజుల తర్వాత బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు సేకరిస్తారు. ఏదైనా అత్యవసర సేవల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఒక వేళ బిఎల్ఓలు ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ (Hyderabad) జిల్లా పరిధిలో ఇంగ్లిష్, మిగతా జిల్లాల్లో తెలుగు (Telugu)లో పత్రాలను అందించనున్నారు. బీఎల్వోలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకూ వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బీఎల్వోలకు అందించాలి.