నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాల జోష్‌తో బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన కెరీర్లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం (వర్కింగ్ టైటిల్ 'NBK 112') ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ వర్గాల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అనంతరం నిర్మాత సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది అంటే 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.* NBK: ఒకే ఏడాదిలో ఆరు 100 డేస్ సినిమాలు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్‌టైమ్ రికార్డ్ అమరావతి వేదికగా బాలయ్య కల సాకారంరాజధాని అమరావతి ప్రాంతంలో ఒక భారీ సినిమా ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించాలనేది బాలకృష్ణ గారి సుదీర్ఘ కల అని, ఆ కల తమ సినిమాతో సాకారం కావడం ఎంతో గర్వంగా ఉందని నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆనందం వ్యక్తం చేశారు. “వ్యక్తిగతంగా నేను ప్రకాశం జిల్లాకు చెందినవాడిని. మన సొంత రాజధాని నడిబొడ్డున ఈ సినిమాను లాంచ్ చేయడం నా జీవితంలో మరువలేని అనుభూతి. గత మూడు, నాలుగేళ్లుగా బాలయ్య గారితో సినిమా చేయాలని చూస్తున్న నా ప్రయత్నం ఇప్పటికి ఫలించింది” అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా కేవలం కమర్షియల్ వినోదాన్ని మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఒక అద్భుతమైన వేదికగా నిలవనుందని మేకర్స్ నొక్కి చెప్పారు. ఏపీలో అపారమైన నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని, వారందరికీ తమ చిత్రంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సినిమా స్పూర్తితో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా మరిన్ని అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూనే, మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమాలు తీసే కొరటాల శివ.. బాలయ్య బాబును వెండితెరపై ఏ రేంజ్లో చూపించబోతున్నారో అని నందమూరి అభిమానులు ఇప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. అమరావతి సెంటిమెంట్ ఈ చిత్రానికి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.