
Rahu Lucky Zodiac News: రాహువుకి ఎంతో ఇష్టమైన ఈ కింది రాశులవారికి ఎల్లప్పుడు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి.
దీంతో పాటు అనుకున్న పనులంలో సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Rahu Lucky Zodiac News: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత రహస్యమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు.. రాహువును ఒక ఛాయా గ్రహంతో పాటు పాప గ్రహం, మాయా గ్రహంగా పిలుస్తూ ఉంటారు. రాహువు అందరికీ నష్టం కలిగిస్తాడనేది నిజం కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. రాహువు అనుగ్రహం ఉంటే.. నిరు పేద వారు కూడా రాత్రికి రాత్రే అపారమైన సంపదను, కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుని అదృష్టం పొందుతారు..
2026 సంవత్సరంలో పంచాంగం ప్రకారం.. రాహువు కుంభ రాశిలో సంచారం చేయబోతున్నాడు.. ఈ ఏడాది చివరిలో రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువుకు కొన్ని అత్యంత ఇష్టమైన రాశులవారికి ఈ సమయంలో ఊహించని ధన లాభాలను అందిస్తాడు.. ఈ రాశులపై రాహువు ఎల్లప్పుడూ ప్రత్యేక కృపను కురిపిస్తూ.. వారిని సంపద అందిస్తాడు. అయితే, ఏయే రాశులవారికి రాహువు అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహు గ్రహ సంచారంతో వృషభ రాశివారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తప్పకుండా పనుల్లో సులభంగా విజయాలు కూడా సాధిస్తారు. చాలా కాలంగా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించని రీతిలో భారీ లాభాలు వచ్చే సూచనలు కనిసిస్తున్నాయి.
ముఖ్యంగా రాహువు ప్రభావంతో ఈ సమయంలో వృషభ రాశివారికి ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో పదోన్నతులతో పాటు జీతాల పెంపు వంటి ప్రయోజనాలు పొందుతారు.. వీరు గతంలో వేసుకున్న ప్రణాళికలన్నీ ఇప్పుడు విజయవంతంగా సాగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనితో పాటు సమాజంలో మీ గౌరవ మర్యాదలు, సామాజిక ప్రతిష్ట గణనీయంగా పెరుగుతాయి.. కొత్తగా ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారుతాయి. తల్లిదండ్రులు లేదా ఇంట్లోని పెద్దల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
రాహు గ్రహం ఎఫెక్ట్‌తో మిథున రాశి జాతకులకు అత్యంత శుభ ఫలితాలను అందిస్తాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ కాలంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా మొదలవుతాయి.. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కెరీర్ పరంగా అద్భతమైన ప్రయోజనాలు పొందుతారు.
మిథున రాశివారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎక్కడైనా నిలిచిపోయిన లేదా రాదనుకున్న మొండి బాకీల డబ్బు తిరిగి మీ చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది.. ఈ కాలంలో మీరు కుటుంబ శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు అవకాశాలు కనిపిస్తున్నాయి..