
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate: బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయిలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా గమనించినట్లయితే ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గుతున్నట్లు మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 4100డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకే నెలలో సుమారు 6 శాతం వరకు బంగారం ధర తగ్గినట్లు మనము గమనించవచ్చు. జూన్ నెలలో బంగారం ధర గరిష్టంగా 1. 55 లక్షల రూపాయల వరకు పెరిగింది. అంటే ఒకే నెలలో సుమారు 10వేల రూపాయల వరకు తగ్గినట్లు మనం గమనించవచ్చు.
అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అని చెప్పాలి. దీనికి తోడు డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టేందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అన్నిటికంటే ప్రధానమైనది బంగారం దగ్గర తగ్గడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భవిష్యత్తులో భారీగా పెంచుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా ఇన్వెస్టర్లను బంగారం నుంచి బయటకు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు.
సాధారణంగా బంగారం ధర అనేది ఎక్కువగా డాలర్ విలువపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో అప్పుడు బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఎప్పుడైతే అమెరికా డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు ధర బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పడుతుంది.
ఎందుకంటే అమెరికా డాలర్ బలపడితే.. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసి ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోన్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కూడా భారీగా తగ్గడం కూడా బంగారం పైన ప్రభావం చూపుతోందని చెప్పాలి. దీనికి తోడు జూలైలో బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.
అయితే అమెరికా విడుదల చేసే కీలకమైన ఆర్థిక డేటా పర్సనల్ కాన్సెప్షన్ ఎక్స్పెండిచర్ల నివేదికలో సానుకూలంగా వచ్చినట్లయితే బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం టెక్నికల్ గా చూస్తే బంగారం ధర 450డాలర్లుగా ఉంది. జూలై నెలలో ఈ స్థాయి వద్ద బంగారానికి బలమైన సపోర్టు లభించే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే ధరలు జూలై నెలలో భారీగా తగ్గడం అంత సులభం కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆనంద్ రాఠి సంస్థ విడుదల చేసిన కమ్యూనిటీ నివేదిక ప్రకారము ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కరెక్షన్ తాత్కాలికం మాత్రమే అని దీర్ఘకాలిక ట్రేడ్ ఇంకా బలంగానే ఉంటుందని.. బంగారం ధరలో మళ్లీ వేగం పంచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.