
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Farming Business: నేటికాలంలో అంతా ఏఐ మహిమనే. ఎక్కడ చూసినా ఏఐ. అందుకే కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అత్యంత డిమాండ్ ఉన్న ఏఐ ఇంజనీరింగ్ వదిలి ఒక యువకుడు వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఈ 28ఏళ్ల యువకుడు వ్యవసాయం చేస్తూ వారానికి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ముంబైకి చెందిన 28ఏళ్ల ఏఐ ఇంజనీర్ పుష్పక్ సాహు.. గతంలో PWCలో ఏఐ ఇంజనీరింగ్ గా పనిచేశాడు. కానీ ఆ ఉద్యోగంలో తనకు సంత్రుప్తి లేదు. తన ఆశయం, కల వ్యవసాయం చేయడం. ఆ కలను సాకారం చేసుకునేందుకు తన ఉద్యోగాన్ని వదిలి.. ఛత్తీస్ ఘడ్ లోని తన స్వంత గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ ఆర్కిడ్లను సాగు చేస్తూ వారానికి 30,000 సంపాదిస్తున్నారు.
అతను వ్యవసాయాన్ని ఒక అభిరుచిగా ప్రారంభించాడు. అందులో మెలకువలు తెలుసుకుంటున్న ఒక విజయవంతమైన వ్యాపారంగా మార్చుకున్నాడు. మాస్టర్స్ డిగ్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డిప్లొమా చదివిన సాహా.. ముంబై రెండేళ్లు పనిచేశాడు. కానీ ఏదో వెలితి. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు. అప్పుడే ఆయన ఆర్కిడ్ల సాగు గురించి స్టడీ చేశాడు. దీంతో ఆర్కిడ్ల పట్ల ఆసక్తి పెరిగింది. సాధారణ పూల మొక్కల వలే కాకుండా ఆర్కిడ్లు వాటి ప్రత్యేకమైన పెరుగుదలకు ప్రసిద్ధి చెందాయి. ఆర్కిడ్లు వాటి ఆకర్షనీయత, ఎక్కువ కాలం తాజాగా ఉండటం, అత్యంత విలువైన పువ్వులకు ప్రసిద్ధి చెందాయి. సాంప్రదాయ మట్టికి బదులుగా సాహు తన మొక్కలకు కొబ్బరి పౌడర్ లేదా బూడిదను ఉపయోగించి పెంచుతున్నాడు.
ఐటీ నుంచి నేరుగా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టడం అంత సులువు కాదు. ఆర్కిడ్ సాకుకు ఉష్ణోగ్రత, సూర్యరశ్మి , వాతావరణాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. సరైన సదుపాయాలు కల్పించాలి. మొక్కల సాగును పూర్తిగా అర్థం చేసుకోవాలి. దీనికి సమయంతోపాటు పెట్టుబడి కూడా భారీగా అవసరం అవుతుంది. అయితే మొక్కలసాగు ప్రారంభంలో సాహు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. సకాలంలో సరైన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మెరుగుపడింది.
నేడు ఆర్కిడ్ల బిజినెస్ ఒక పెద్ద వ్యాపారంగా ఎదిగింది. ఇండోర్ గార్డెనింగ్, అన్యదేశ మొక్కలకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా సాహు ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించింది. ప్రతివారం సుమారు 1000 పువ్వుల గుత్తులను కోల్ కతా, భువనేశ్వర్, కటక్, నాగ్ పూర్, రాయ్ పూర్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారం ఇప్పుడు వారానికి 30వేల ఆదాయాన్ని ఇస్తోంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.